21-08-2025 08:34:48 AM
హైదరాబాద్: టప్పా చబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో(Tappachabutra Police Station) యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సురేశ్ అనే యువకుడు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న టప్పచబుత్రా పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.