calender_icon.png 21 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న

21-08-2025 09:21:46 AM

రెండు రోజుల్లో ఏరియా సరఫరా చేయకపోతే ఏవో ఆఫీస్ ను ముట్టడిస్తాం. 

సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య.

మరిపెడ,(విజయక్రాంతి): మరిపెడ మండలవ్యాప్తంగా  రైతన్నలు యూరియా బస్తాలులా కోసం రోడ్డెక్కిన రైతన్న. రైతన్నలను మభ్యపెట్టి, లిస్టుల పేరుతో తికమక పెట్టి, రైతులు ఆగం చేస్తూ, కాలయాపన చేస్తున్నారు. మరిపెడ మండల పిఎసిఎస్ గోదంకు యురియా వస్తుందని రెండు ,మూడు రోజుల నుంచి రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా ఒక యూరియా బస్తా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.

గత ప్రభుత్వంలో లేని యూరియా లోటు , ఈ ప్రభుత్వం లో ఎందుకు వచ్చిందని  ప్రశ్నిస్తూ, టోకెన్ పేరుతో టోకరా వేస్తూ, ఆధార్ కార్డుల పేరుతో  ఇష్ట రాజ్యాంగ యూరియాను  అమ్మకం చేస్తున్నారని, కనీసం వారం రోజులు తిరిగిన ఒక యూరియా బస్తా కూడా రాలేదని, ఇప్పటికైనా జిల్లా అధికారులు మేల్కొని, వ్యవసాయ అధికారులు మేల్కొని, సొసైటీ అధికారులు, చైర్మన్ చొరవతో  సన్న కారు, చిన్న కారు  రైతులకు సరిపడ   యూరియా పంపిణీలో  సహాయ పడాలని మండల రైతుల కోరుతున్నారు.