calender_icon.png 21 August, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ మోసం.. 3 రోజుల్లో రూ.12.75 లక్షలు కొట్టేశారు

21-08-2025 08:48:48 AM

హైదరాబాద్: నగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఎస్‌జీ కమాండో(NSG commando) పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఖైరతాబాద్ కు చెందిన యువకుడి నుంచి రూ. 12.75 లక్షలు కాజేశారు. తన ఇల్లు అద్దెకు ఉందంటూ మ్యాజిక్ బ్రిక్స్ లో బాధితుడు పోస్ట్ చేశాడు. గుర్తు తెలియని నంబర్ నుంచి బాధితుడికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. డబ్బులు వేసేందుకు నేరగాళ్లు బ్యాంకు ఇంటి యజమానిని వివరాలు అడిగారు. ఖాతా వివరాలు తేడా రాకూడదని యజమానిని కొంత డబ్బు పంపమని నేరగాళ్లు కోరారు. బాధితుడి వద్ద 3 రోజుల్లో రూ.12.75 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.