21-08-2025 09:46:47 AM
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో గురువారం నాడు విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. ప్రాథమిక దర్యాప్తులో వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు. మృతుల్లో అత్త, మామ, కుమార్తె, అల్లుడు, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. మృతులను లక్ష్మయ్య(60), వెంకటమ్మ(55), అనిల్(32), కవిత(24)గా గుర్తించారు. మియాపూర్ మక్త మహబూబ్ పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడ మండలం రంజోలి వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.