calender_icon.png 13 July, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ కు సన్మానం

12-07-2025 07:35:18 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజవర్గానికి తొలిసారిగా వచ్చిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఎమ్మెల్యే ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA MLA Gaddam Vinod) సన్మానించారు. క్యాంపు ఆఫీస్లో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ అనిల్‌ కుమార్ యాదవ్ తొలిసారిగా పాల్గొన్నారు. మొదటిసారి వచ్చిన ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అనిల్ కుమార్ యాదవ్ ను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి. సీనియర్ నాయకుడు ముని మంద రమేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు కర్కూరి రాంచందర్, కాంగ్రెస్ పార్టీ తండూరు మండల అధ్యక్షులు ఎండీ ఈస, తదితరులు పాల్గొన్నారు.