12-07-2025 07:39:47 PM
నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డ కమ్యూనిస్టు యోధుడు దొడ్డ నారాయణరావు..
ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకే తీరని లోటు..
ఆయన పార్ధివదేహానికి నివాళులర్పించిన పలు రాజకీయ నేతలు..
చిలుకూరు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ(CPI Party National Secretary K Narayana) అన్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి కోదాడ హుజూర్నగర్ పరిగణాలలో ఎర్రజెండాను రెపరెపలాడిచ్చిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ దొడ్డ నారాయణరావు అని రాజకీయాల్లో అత్యంత విలువలు కలిగిన వ్యక్తిగా చెరిగిపోని ముద్ర వేసుకున్న ఆయన ఉమ్మడి నల్లగొండ జిల్లా సిపిఐ పార్టీ మాజీ కార్యదర్శిగా పనిచేసి, చిలుకూరు సర్పంచ్ గా, పిఎసిఎస్ చైర్మన్ గా ఎంపీపీగా, ఎన్నో మహోన్నత పదవులను అనుభవించిన మహా వ్యక్తి ఆయన అని, 1940లో నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, భూమికోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి, విముక్తి కోసం, మద్యపాన నిషేధం కోసం, పీడిత ప్రజల పక్షాన నిలిచిన యోధుడు నారాయణరావు అని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నారాయణరావు పేరు ఎందరికో సుపరిచితమని, 96 ఏళ్ళు వయసులో కూడా ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్న తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడ సిపిఐ సమావేశాలు సభలు జరిగిన నేటికి పాల్గొంటూ యువతకు ఆదర్శంగా నిలిచినాడు.
భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటంలో ఆంధ్ర మహాసభలో ప్రముఖ పాత్ర పోషించాడని, అట్టి సుప్రసిద్ధ ఆంధ్ర మహాసభ చరిత్రను మలుపు తిప్పిన ఘనత చిలుకూరు ఆంధ్ర మహాసభ దేనిని 1930 లో భాష ఉద్యమంగా పుట్టినదని నిజాం వ్యతిరేక రాజకీయ ఉద్యమంగా మలుపు తిరిగిందని ఆ మలుపు తిప్పిన చరిత్ర ఆనాటి చిలుకూరు ఆంధ్ర మహాసభకు దక్కుతుందని, వర్గ రహిత నవ సమాజ నిర్మాణం కోసం కలలు కంటూ నిత్యం మాట్లాడుకునే అనుభవం నేటి తరానికి అపురూప అంశమేనని యువతరాన్ని నవతరంగా మలుచుకొని కమ్యూనిజం వైపు అడుగులు వేయాలని ఆయన చెప్పేవారని, ఆయన భౌతికంగా మనకు దూరమైన ఆయన ఆశయాలు మాత్రం మాతోనే ఉంటాయని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
జాతీయ కార్యవర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, కోదాడ శాఖ సభ్యురాలు పద్మావతి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందారావు, ఉజ్జిని యాదగిరిరావు, గన్నా చంద్రశేఖర్, ప్రముఖులు పాల్గొన్నారు.