స్టెమ్‌స్పార్క్ రెజోనెన్స్‌లో రాఖీ వేడుకలు
శ్రీనగర్ కాలనీలో స్కూల్‌లో ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 28(విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోని స్టెమ్‌స్పార్క్ రెజోనెన్స్ స్కూల్‌లో శుక్రవారం రాఖీ పూర్ణి మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ వేడుకల్లో విద్యార్థినులు విద్యార్థులకు రాఖీలను కట్టి వారందరు వారి ల క్ష్యాలను, విజయాలను సాధించాలని, ఆ యురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వేడుకలను నిర్వహించారు.
పాఠశాల డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న భారతీయ సాంప్రదాయం లోని రాఖీ పండుగ విశిష్టతను విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు. రెజోనెన్స్ స్కూల్ శ్రీనగర్‌లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మన సంస్కృతి సంప్రాదాయాలను వారి జీవితంలో ఒక భాగంగా పెంపొందిస్తామని తెలియజేస్తూ అందరికి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కొండా కృష్ణవేణి, ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






