29 August, 2026 | 2:47 AM

ఆత్మీయంగా రక్షాబంధన్ వేడుకలు

29-08-2026 01:48 AM

నాగోల్‌లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో నిర్వహణ

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నాగోల్‌లోని పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి.

ఈ సందర్భంగా సోదరీమణులు సోమ నాగరాణి, మంజుల ఉప్పల శ్రీనివాస్ గుప్తకి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరుడికి రాఖీ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. రక్షాబంధన్ పర్వదినం అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలను మరింత బలోపేతం చేసే గొప్ప పండుగ అని అన్నారు.

సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తనకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరీమణులు సోమ నాగరాణి, మంజులకి ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకున్నారు.