10-08-2025 01:22:46 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని మేయ ర్ గద్వాల విజయలక్ష్మి నివాసంలో శనివారం ఘనంగా రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. నగర నలుమూలల నుంచి కులమతాలకు అతీతంగా ప్రజలు వివిధ డివిజన్‌ల నుంచి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా మేయర్ వేడుకల్లో పాల్గొన్న వారికి, నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.