10-08-2025 09:41:58 AM
మంథని అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుడు పర్షవేణి మోహన్ యాదవ్..
మంథని (విజయక్రాంతి): మంథని మండలం(Manthani Mandal)లోని ఖాన్ సాయిపేటలో శనివారం పిడుగుపాటుతో మృతిచెందిన 15 గొర్రెలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని మంథని అఖిల భారత యాదవ సంఘం మండల అధ్యక్షుడు పర్షవేణి మోహన్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. జీవన్ ఉపాధి కోసం గొర్రెల కాపరి అయిన ఎల్లన్న యాదవ్ మంచిర్యాల జిల్లా బోత్ మండలం నుంచి మేత కోసం మంథని మండలం ఖాన్ సాయిపేట అడివిలోకి వచ్చి గొర్రెలను కాసుకుంటున్నాడని, ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పిడుగుపడి 15 గొర్రెలు మృతి చెందడంతో దాదాపు రెండు లక్షల వరకు నష్టం జరిగిందని మోహన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన ఎల్లన్నకు ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు.