calender_icon.png 10 August, 2025 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ చోరీ.. 13 తులాల బంగారం అపహరణ

10-08-2025 09:39:07 AM

రామకృష్ణాపూర్: వరలక్ష్మి వ్రతనికి సొంత ఊరికి వచ్చిన సింగరేణి ఉద్యోగి కుటుంబనికి దొంగలు చేదు అనుభవం మిగిలిచ్చారు. రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక గద్దరేగడి పద్మావతి కాలనీకి చెందిన మేకల రాజయ్య అనే వ్యక్తి వృత్తిరీత్యా భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉండగా భూపాలపల్లి నుండి రాజయ్య కుటుంబ సభ్యులతో పూజ నిర్వహించుకునేందుకు గద్దరేగడి పద్మావతి చేరుకున్నారు. వ్రతం నిర్వహించుకున్న తర్వాత అందరూ సుమారు రాత్రి 11 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. మరుసటిరోజు తెల్లవారు జామున నిద్రలేచి చూడగా ఇంటిలోని వస్తువులు చిందరవందరగా పడవేసి ఉండటంతో కంగుతున్న రాజయ్య తమ బ్యాగులో చూడగా అందులో ఉంచిన 13 తులాల బంగారు ఆభరణాలు కనబడకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వాటి విలువ సుమారు రూ.2 లక్షల 86 వేల ఉంటుందని చెప్పారు. రాజయ్య ఇంట్లో జరిగిన దొంగతనం ఒక్కసారిగా పుర ప్రజలు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, సమీపంలో గల సీసీ-కెమెరాల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే దొంగలను పట్టుకొని పోలీస్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కేసును చేదించి దొంగలను పట్టుకుంటామని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.