28 August, 2026 | 9:25 AM

పీవీఎన్‌ఆర్‌లో రక్షా బంధన్ వేడుకలు

28-08-2026 12:04 AM

ముకరంపుర, ఆగస్టు 27(విజయక్రాంతి): కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పీవీఎన్‌ఆర్ యోగ కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు మహేందర్ గురూజీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నిత్యం యోగ సాధన చేసే సోదరీమణులు అందరూ సోదర భావంతో రాఖీలు కట్టారు. అనంతరం నీకు నేను రక్షా.. నాకు నీవు రక్షా..ఇద్దరం దేశానికి రక్షా అనే నినాదంతో దేశభక్తితో వేడుకలు నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు.