28 August, 2026 | 6:55 AM

తిమ్మాజిపేట ఎస్‌ఐపై ఫాల్స్ అలిగేషన్

28-08-2026 12:05 AM

కేసు నుండి తప్పించుకునేందుకే పోలీసులపై తప్పుడు ఆరోపణలు. 

మాట మార్చిన డీఎస్‌పీ

మొదట బాధితుడిపై దాడి చేసింది వాస్తవమే అంటూ తర్వాత బొకాయింపు 

కట్ట గాయాలు లేనందుకే వైద్య పరీక్షలకు పంపలే

మీడియా ముందు డీఎస్‌పీ బుర్రి శ్రీనివాసులు 

నాగర్ కర్నూల్ ఆగస్ట్ 27 (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల ఎస్త్స్ర శ్రీనివాసరావు పై ఆవంచ గ్రామానికి చెందిన మహేందర్ చేసిన ఆరోపణలు వాస్తవం లేదని అవి ఉట్టి ఫాల్స్ అలిగేషన్ అంటూ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు కొట్టి పారేసారు.

గురువారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిమ్మాపేట పోలీస్ స్టేషన్ ఘటన అంశంలో మాట్లాడారు. ఆవంచ గ్రామానికి చెందిన  సాయి వర్షిని అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన పాలమూరు మహేందర్ అనే వ్యక్తిపై కేసు నమోదు కావడంతో కేసు నుండి తప్పించుకోవడం కోసమే ఎస్త్స్ర శ్రీనివాసరావు దాడి చేసి ముఖంపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపించాడని డిఎస్పీ తెలిపారు.

ఈనెల 25న బాధితుడు తనను ఆశ్రయించి తిమ్మాజిపేట ఎస్త్స్రపై ఫిర్యాదు చేశారని దానిపై వెంటనే సీఐ అశోక్ రెడ్డి మరో ఇద్దరిని విచారణ అధికారులుగా నియమించి విచారణ జరిపినట్లు తెలిపారు. అక్కడి రికార్డులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించినట్లు తెలిపారు. కేవలం తనపై నమోదైన కేసు నుండి తప్పించుకోవడం కోసం మాత్రమే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేశారని నిర్ధారణ అయినట్లు తెలిపారు. 

మాట మార్చిన డీఎస్‌పీ

 ఈనెల 27న బాధితుడు మహేందర్ డీఎస్పీకి ఫిర్యాదు ఇచ్చిన రోజు మీడియాతో మాట్లాడుతూ చేయి చేసుకున్న మాట వాస్తవమే కానీ ముఖంపై మూత్ర విసర్జన అంశం నమ్మసక్యంగా లేదంటూ విచారణ జరిపి నిజమని తేలితే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు విచారణ అనంతరం దాడి కూడా జరగనేలేదంటూ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. బాధితుడు ఫిర్యాదు చేసిన రోజు కూడా వైద్య పరీక్షలకు పంపకపోవడం అంశాన్ని ప్రశ్నించగా రక్త గాయాలు కానందుకే మెడికొ లీగల్ కేస్ పంపలేదన్నారు. ఎస్త్స్రని మరో ఇద్దరు కానిస్టేబుల్ లను కాపాడుకునేందుకే తూతూ మంత్రంగా విచారణ జరిపించాలని బాధితుడు స్థానికుల ఆరోపిస్తున్నారు..