29 August, 2026 | 4:52 PM

తాడూరు కేజీబీవీలో రక్షాబంధన్ వేడుకలు

29-08-2026 03:48 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తాడూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించిన డీఈఓ వారి చదువు, పాఠశాలలో అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ రక్షాబంధన్ సోదరభావం, ఆప్యాయతకు ప్రతీక అన్నారు. విద్యార్థినులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.