6 June, 2026 | 11:40 AM

అభివృద్ధికి దూరంగా రామ్ నగర్.. దేశ సేవలో ఆడబిడ్డలిద్దరూ..!

06-06-2026 10:34 AM

కష్టజీవుల కడుపున పుట్టిన 9 మంది యువకులు దేశ సేవకులే

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న రామ్ నగర్ గ్రామం దాదాపు రెండు దశాబ్దాల క్రితం వెలిసింది. మత్తుర సామాజిక వర్గానికి చెందిన వారంతా ఈ గ్రామంలో జీవిస్తున్నారు. వ్యవసాయని నమ్ముకుని జీవిస్తున్న ఈ గ్రామంలో 42 కుటుంబాలు ఉన్నాయి ఒక వంద 60 మంది జనాభా ఉన్న ఈ గ్రామం నుండి 11 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిలో 9 మంది నావిక దళం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ,సి ఆర్ పి ఎఫ్, ఏ ఆర్, పోలీసు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నారు.

తల్లిదండ్రులు పొలం పనుల్లో.. బిడ్డలు దేశ సేవలో 

మారుమూల లో ఉన్న రామ్ నగర్ గ్రామం 10 సంవత్సరాల క్రితం కనీస రోడ్డు వసతికి మూసుకోలేదు. అయితే అదే సమయంలో మోకాలి లోతు బురదలో నడుచుకుంటూ కౌటా బి గ్రామంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు వచ్చి చదువుకున్నారు. వారి తల్లిదండ్రులకు చదువుపై ఉన్న ఆసక్తికి తోడు వారి పిల్లలు పట్టుదలతో చదువుకోవడం జరిగింది. రైతు కుటుంబాలకు చెందిన వీరంతా ప్రస్తుతం ముగ్గురు బిఎస్ఎఫ్ ఇద్దరు నావికాదళం మరో ఇద్దరు సిఆర్పిఎఫ్ ఒకరు ఆర్మీ జవాన్ మరొకరు ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. మరో ఇద్దరు గ్రామ కార్యదర్శి ఉపాధి హామీలో ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఉదయం నుండి రాత్రి వరకు పంట పొలాల పనుల్లో నిమగ్నమై ఉంటే పిల్లలేమో దేశ సరిహద్దుల్లో నిమగ్నమయ్యారు.

ఆడబిడ్డలిద్దరూ బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు

గ్రామానికి చెందిన యువకులను ఆదర్శంగా తీసుకున్న ఇద్దరు యువతులు దేశ సేవలో మేము కూడా పనిచేస్తామంటూ ముందుకు వెళ్లారు. గ్రామానికి చెందిన మీనాక్షి,  సరస్వతి లు బిఎస్ఎఫ్ లో చేరి దేశ సేవ కంకితమయ్యారు. మహిళలమని భయపడకుండా దేశ సేవలో నిమగ్నం కావడం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్తులో మరి కొంతమందిని ఈ గ్రామం నుండి దేశ సేవకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు అంటున్నారు.

మా ఊరికి గర్వకారణం... సుందర్ సింగ్.

మారుమూలన ఉన్న మా గ్రామం నుండి 11 మంది ఉద్యోగాలు సంపాదించి తొమ్మిది మంది దేశ సేవలో నిమగ్నం కావడం మా గ్రామానికి గర్వకారణం అని గ్రామ యువకుడు సుందర్ సింగ్ పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరింత మందిని సైనికులుగా చేరేందుకు ప్రోత్సహిస్తున్నామని పేర్కొంటున్నారు ఏది ఏమైనా మారుమూల గ్రామం నుండి 9 మంది దేశ సేవలో నిమగ్నం కావడం ఆదర్శంగా ఉందని పేర్కొంటున్నారు