01-10-2025 01:55:32 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): హైదరాబాద్ నగరలోని సచివాల యం సమీపంలో ఉన్న ’తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ పేరును ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో ఈ మార్పు అధికారికంగా అమలులోకి వచ్చింది.
ఇప్పటివరకు ‘తెలుగు తల్లి’ ఫ్లైఓవర్‌గా అందరికీ సుపరిచితమైన ఈ ఫ్లైఓవర్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా గుర్తింపు పొందనుంది. నగరంలోని ప్రధాన కూడళ్లను కలిపే ఈ మార్గంలో అధికారులు కొత్త పేరును సూచిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు.