calender_icon.png 13 September, 2024 | 12:33 AM

రామడుగు ఎస్సైతో ప్రాణహాని

11-07-2024 12:19:28 AM

రక్షణ కల్పించాలని దంపతుల వేడుకోలు

కరీంనగర్ సిటీ, జూలై 10: రామడుగు ఎస్సై మామిడాల సురేందర్ తో తమ కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని దంపతులు కుతాడి కనుకయ్య, కుతాడి అనిత వేడుకున్నా రు. బుధవారం కరీంనగర్ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. దొంగతనం కేసులో తమను అన్యాయంగా ఇరికించి, నేరాన్ని ఒప్పుకో మంటూ చిత్రహింసలకు గురి చేశాడ ని దంపతులు ఆరోపించారు. ఎస్సై మామిడాల సురేందర్‌పై చర్యలు తీసుకుని, తమకు రక్షణ కల్పించాల ని, తమకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారివెంట కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి నాగరాణి, పుష్పలత, రాణి ఉన్నారు.