30 July, 2026 | 11:43 PM

రాముడు నడయాడిన నేల

25-08-2024 01:19 AM
  • టూరిజం స్పాట్‌గా రామగిరి ఖిల్లా
  • మంత్రి ఆదేశాలతో చిగురిస్తున్న ఆశలు 
  •  పర్యాటక కేంద్రం దిశగా అడుగులు
  •  శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో కదలిక

  • * ప్రకృతి రమణీయత, సెలయేటి గలగలలు, అద్భుతమైన కళాఖండాలతో గత వైభవానికి నిలువెత్తు సాక్ష్యం రామగిరి.  పెద్దపల్లి జిల్లాలోని ఈ కాకతీయ రాజుల ఏలుబడితో శతాబ్దాల చరిత్రను సంతరించుకుంది. కాకతీయుల కళా నైపుణ్యానికి ఈ కోట పెట్టింది పేరు. కోటపై అపురూపమైన కట్టడాలు ఇప్పటికీ పర్యాటకులను అబ్బురపరుస్తుంటాయి. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వనవాసం సమయంలో రామగిరి దుర్గంపై నడయాడినట్లు చరిత్ర సాక్ష్యాలు ఇప్పటికీ అక్కడ సజీవంగా ఉన్నాయి. అందుకే రామగిరికి పర్యాటక కేంద్రంగానే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ పేరుంది. అంతేగాక  కోటపై దాదాపు 200 రకాల అత్యంత విలువైన వన మూలికలు కూడా ఉన్నాయి. 

పెద్దపల్లి,ఆగస్టు 2౪ (విజయ క్రాంతి): అద్భుతమైన కళా సంపదకు నిలువెత్తు నిద ర్శనంగా ఉన్న పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిల్లా టూరిజంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లుగా మరుగున ఉన్న రామగిరి ఖిల్లా చరిత్రను ప్రపంచానికి చాటేందుకు  రాష్ట్ర ఐ టీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దృ ష్టి సారించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కా ర్యాలయం నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్షకు సంకేతాలు వచ్చాయి.

ఆ వెంటనే రామగిరి మండల రెవెన్యూ అధికారులతో ఆగమే ఘాల మీద సమావేశమైన కలెక్టర్ రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీనితో చాలా కాలంగా కలగా ఉన్న రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రంపై ఆ శలు చిగురించాయి. రామగిరి కోటపై మం త్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టి సారించడం సర్వత్రా హర్షం వ్యక్తమవు తుంది. రాష్ట్రం లోనే ప్రాచీన కళా సంపదకు నిలయమైన ఈ ఖిల్లాను అభివృద్ధి చేయాలని దశాబ్దా లుగా పాలకులకు విన్న వించినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు.

నాడు పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మం డలం మంగ పేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్ మండలానికి చెం దిన మాధవ రావు, బలరాందాస్‌లు “రామగిరి మహ త్యం” పేరుతో ఓ గ్రంధాన్ని కూడా రాశారు. శ్రావణ మా సంలో దేశం నలుమూలల నుంచి రామగిరి ఖిల్లాకు పర్యా టకులు వస్తుంటారు. ప్రాచీన సంస్కృతి, కళా వైభ వానికి అద్దం పట్టే కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో ఉందని పర్యాటక ప్రేమికులు గొంతు చిం చుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. బీజే పీ ఆధ్వర్యంలో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విద్యాసాగర్ రావు పాద యాత్ర చేపట్టి ఈ రామగిరి ఖిల్లాను అధిరోహించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దు తామని హామీ కూడా ఇచ్చారు. 

ఖిల్లా చరిత్ర

చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకు డు ఈ దుర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చా రని చరిత్ర చెబుతోంది. క్రీ.శ 1158లో చాళు క్య గుండ రాజును కాకతీయులు ఓడించి రామగిరి దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు, మంత్రకూటమిల శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత గురిజాల కమ్మ వంశీయులు, ముసునూరి కమ్మరాజుల ఆధ్వర్యంలో శత్రు దుర్భేధ్యమైన కోటగా నిర్మించి పాలించారు. రామగిరి రాజధానిగా రాజు గురిజాల ముప్ప భూపతి సబ్బినాడు ను వైభవోపేతంగా పరిపాలించాడు. 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వీరి పాలన సాగింది.

1442లో బహమనీ సుల్తానులు ఈ కోటను ఆక్రమించుకోగా, 1595లో మొఘలాయిలు స్వాధీనం చేసు కున్నారు. 1606లో గోల్కొండ నవాబులు ఈ దుర్గాన్ని వశపర్చుకున్నారు. వారి నుంచి మహమ్మదీయులు నైజాం కాలం వరకు పా లించారు. అప్పట్లో రామగిరి కోటకు ఇరువై పులా 9 పిరంగులు, 40 తోపులు ఉండేవి. వాటిలోని ఒక్క పిరంగి ఇప్పటికీ చెక్కు చెద రకుండా అలాగే ఉంది. ఈ దుర్గం అంత ర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగే కోట, ప్రతాప రుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువు శాల, మొఘల్ శాల, చెరశాల, గజ శాల, భజన శాల, సభాస్థలితోపాటు చెక్కర బావి, సీతమ్మ బావి, పసరు బావి, సీతమ్మ కొలను, రహస్య సొరంగాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

శ్రీరాముడు నడియాడిన నేల..

వనవాస కాలంలో శ్రీరాముడు రామగిరి ఖిల్లాపై కొద్ది రోజులు సేద తీరినట్లు చరిత్ర చెబుతోంది. సీతారాములు సంచరినట్లు ఆనవాళ్లు ఇప్పటికీ కూడా దర్శనమిస్తాయి. ఖిల్లాపై గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. 

ఇన్నాళ్లకు అభివృద్ధికి బాటలు..

మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో ఇన్నాళ్లకు రామగిరి ఖిల్లా అభివృద్ధికి బాటలు పడబోతున్నాయి. మండలంలోని బేగంపేట నుంచి రామగిరి ఖిల్లా వరకు రోడ్డు వసతి మెరుగు పర్చాలని జిల్లా కలెక్టర్, అధికారు లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఖిల్లాను పర్యా టకులు పూర్తిగా చూడాలంటే కొండపైనే 16 కి.మీ నడవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే అద్భుతమైన కళా ఖండాలలో రామగిరి ఖిల్లా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. చా లా కాలం తర్వాత పర్యాటక కేంద్రంగా అడు గులు పడుతుండటంతో  జిల్లా ప్రజలు హ ర్షంవ్యక్తం చేస్తున్నారు. దీనితో మంథని నియోజక వర్గం కూడా మరింత అభివృద్ధి లోకి రావడానికి అవకాశం ఏర్పడింది.