29 July, 2026 | 1:17 AM

‘ఆటా’కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

29-07-2026 12:00 AM

30 నుంచి ఆగస్టు 6 వరకు రాంచందర్‌రావు పర్యటన

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): అమెరికాలో ఈ నెల 31 నుంచి ఆగస్టు 2 వరకు జరిగే ప్రతిష్టాత్మక ‘ఆటా’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు హాజరుకానున్నారు. అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న ఈ మూడు రోజుల సమ్మేళనాని కి రాంచందర్ రావుని విశిష్ట అతిథిగా హాజరుకావాల్సిందిగా ‘ఆటా’ ఆహ్వానిస్తూ లేఖ రాసింది.

ఇందులో పాల్గొనడానికి రాంచందర్‌రావు ఈ నెల 30న అమెరికా బయలు దేరి వెళ్లి కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఆగస్టు 6న హైదరాబాద్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా సమాచార సాంకేతికత, పర్యాటకం, డిజిటల్ సేవలు, స్టార్టప్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేలా ఈ మహాసభల్లో ప్రత్యేక ప్యానెల్ చర్చలు, నెట్‌వర్కింగ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్, పారి శ్రామికవేత్తలు, యువ నాయకులతో రాం చందర్‌రావు భాగస్వామ్యం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ఆటా ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు.