calender_icon.png 23 September, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రామ్‌లీలా పంచాయితీ

23-09-2025 12:27:03 AM

  1. వేర్వేరుగా కోమటిరెడ్డి, గంగుల వర్గాల ఏర్పాట్లు

ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాజకీయరంగు

కరీంనగర్, సెప్టెంబర్22{:విజయక్రాంతి}: గత పదిహేను సంవత్సరాలుగా మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో జరుగుతున్న రాంలీ లా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించేంకు ఏర్పాట్లు పం చాయతి తో మొదలైనాయి.అధికార పార్టీ కి చెందినసుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్థానిక మాజీ కార్పోరేటర్లు మల్లికార్జున రాజేందర్,బోనాల శ్రీకాంత్, దిండిగాల మ హేష్,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్ర మోద్ రావుతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.

గతంలో చేసిన వారి అనుభవాలు తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అందరితో కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని అన్నారు. అనంతరం. మార్క్ ఫెడ్ మైదానంలో దసరా రో జు నిర్వహించే రావణ దహన కార్యక్రమం కోసం భూమి పూజచేసి పనులు ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.

వీరివెంట నగర బి ఆర్ ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, మార్క్ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోదరావు లు ఉన్నారు. ఈ మైదానం లో తొలుత యూత్ క్లబ్ అద్వర్యం లో వేడుకలు జరిగేవి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో  నడుస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నాయకులుమీదేసుకొని పని చేస్తున్నారు.

ఈ క్రమంలో సూడా చైర్మన్ పర్యటించారు. ఆయనకు బి ఆర్ ఎస్ కు చెందిన మాజీ కార్పొరేటర్ లు స్వాగతం కుడా పలికారు. కాంగ్రెస్ వారి వల్ల తమ పెత్తనం పడిపోతుందని అనుకున్నారో ఏమో తెల్లారి సోమ వారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పూజ చేయించారు. ఎమ్మెల్యే భూమి పూజ చేయడంతో స్థానిక నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానికులు హుటా హుటిన మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు పరుగులు తీశారు. రావణ దహన కార్యక్రమం వరకు పరిస్థితులు ఎటు దారి తీస్తాయోచూడాలి.