23-09-2025 12:28:09 AM
- ఆమనగల్లు మండల కేంద్రంలో భూనిర్వాసితుల సదస్సు
-ముఖ్యఅతిథిగా పాల్గొన్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్
ఆమనగల్లు, సెప్టెంబర్ 22 : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్ రోడ్డు మ్యాప్ పాత అలైన్మెంట్ ను కొనసాగించాలని, కొత్త అలైన్మెంట్ ను వెనక్కి తీసుకొవాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ గారు డిమాండ్ చేశారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ పట్టణ కేంద్రంలో వెంకట నరసింహ గార్డెన్ లో రీజినల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితుల భూ అవగాహన సదస్సును కానుగుల వెంకటయ్య అధ్యక్షతన నిర్వహించారు.
సదస్సుకు మాడుగుల,ఆమనగల్లు,తలకొండపల్లి మం డలాల నుండి పెద్ద ఎత్తున భూ నిర్వాసిత రైతులు హాజరయ్యారు. కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ గారు ము ఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్ర భుత్వం భూస్వాముల భూములను కాపాడ డం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికోసం ప్రభుత్వం అలైన్మెంట్ మార్చిందని ఆ యన విమర్శించారు. రింగ్ రోడ్డు అంటే రిం గు లాగా ఉండాలి కానీ వంకర వంకరలుగా ఎందుకు మారిందో ఎవరి ప్రయోజనాల కో సం మారిందో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సమాధానం చెప్పాలన్నారు.
ఈ ప్రాంత రైతులు మెజార్టీ గా చిన్న సన్న కారు రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సా గిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభు త్వం నిబంధనలకు విరుద్ధంగా పేద రైతుల భూములను లాక్కోవడం అన్యాయమని, రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ గతంలో రై తు పోరాటాలు ఢిల్లీ పీఠాన్ని కదిలించే ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దని ఆ యన హితవు పలికారు. సమావేశంలో పలువురు రైతు సంఘాల నాయకులు, బాధిత రై తులు మాట్లాడి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు న్యాయం చేయాలని వారంతా నినాదించా రు.
కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగయ్య, జంగారెడ్డి, జిల్లా అ ధ్యక్షులు దుబ్బాక రామచందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి అంజ య్య , రైతు సంఘం నాయకులు ఎమ్ యా దయ్య గుమ్మడి కురుమయ్య,పిప్పళ్ల శివశంకర్ భూ నిర్వాసితుల పోరాట కమిటీ అధ్య క్షులు దొడ్డి పరమేష్, భూ నిర్వాసితుల పో రాట కమిటీ నాయకులు గడిగ వెంకట స్వా మి, పబ్బతి శ్రీను, సంజీవరెడ్డి, జైపాల్ రెడ్డి, లక్ష్మయ్య,జంగారెడ్డి, కొత్తపల్లి రాములు, శ్రీనివాస్ భూ నిర్వాసిత రైతులు నరసింహ, శం కర్,ఆరోగ్య రెడ్డి, అంజి,వెంకటేష్ మాధవరెడ్డి నరసింహ శంకరయ్య గౌడ్, యాదయ్య, చిట్టెమ్మ, రాములమ్మ ,నిర్మలమ్మ ,సువర్ణ ,ఎల్లమ్మ ,రామచంద్రయ్య,తిరుపతయ్య, స్వా మి, రమేష్, కళ్యాణ్ నాయక్,శంకర నాయక్, యాదగిరియాదవ్,శ్రీకాంత్,శివ,కరుణలత, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.