23-09-2025 12:26:33 AM
ఎల్బీనగర్, సెప్టెంబర్ 22 : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డిపై స్థానిక బీఆర్‌ఎస్‌సోషల్‌మీడియా ఉద్ధేశపూర్వకంగా తప్పుడు వార్తలను సృష్టిస్తూ గోబెల్స్‌ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఎల్బీనగర్‌డీసీపీ ప్రవీణ్‌కుమార్‌ను కోరారు.
సోమవారం ఎల్బీనగర్‌లోని డీసీపీ ఆఫీస్‌లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా కీసర ఓ భూ సమస్యకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి పై తప్పుడు వార్తలు సృష్టిస్తూ... సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు.
కాంగ్రెస్‌ప్రజా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసి ఓర్వలేని బీఆర్‌ఎస్‌సోషల్‌మీడియా మాపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కీసరలో భూ సమస్యకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫేక్‌వార్తలు వ్యాప్తి చేస్తూ..తమ పరువుకు భంగం కలిగిస్తున్నవారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరినట్లుచెప్పారు.