calender_icon.png 4 October, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం

04-10-2025 01:20:02 AM

-కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లను ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు

- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, అక్టోబరు 3 (విజయ క్రాంతి): అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్... లోకల్ బాడీ ఎ న్నికల తరువాత ఇక్కడున్న వారిలో చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలవబోతున్నారు.. ఈసారి కరీంనగర్, సిరిసిల్ల జి ల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాలను బీజేపీ కైవసం చేసుకోబోతోంది.. సర్వే నివేదికలన్నీ ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

శుక్రవారం కరీంనగర్ లో ని ఈఎన్ గార్డెన్స్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మం త్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దా మా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

మిమ్ముల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, పంచాయతీలకు నిధులిస్తోంది, అభివ్రుద్ధి చేస్తోంది కూడా కేంద్ర నిధులతోనేనని అన్నారు. ప్రతి పల్లెలో ఉపాధి హామీ పనులు, ప్రధాని సడక్ యోజన, సీఐఆర్‌ఎఫ్ సహా అబివ్రుద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. కేంద్రం నిధులివ్వకపోతే ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేవాళ్లని తాజామాజీ సర్పంచులు కూడా చెబుతున్నారని అన్నా రు. ఉద్యోగులు, ఉపాధ్యాయులుసహా అన్ని వర్గాల ఉద్యోగులు కాంగ్రెస్ పై కోపంతో ఉ న్నారని, మహిళలు, వ్రుద్దులు, రైతులు ఎవ రూ ఆ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు.

మ హిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానని మాట తప్పారు. వ్రుద్దలుకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామని మోసం చేశారన్నారు. రైతు కూలీలకు రైతు భరోసా ఇవ్వలేదని, రైతులకు కూడా ఒక్కసా రే భరోసా నిధులు ఇచ్చారని, ఎన్నికల తరువాత రైతు భరోసా పైసలు కూడా ఎగ్గొ ట్టబోతున్నారన్నారు. అంతెందుకు 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చారా? ఇయ్యలేదని, ప్రజలంతా కాంగ్రెస్ పేరొత్తితే తిడుతున్నారన్నారు. అందరూ బీజేపీవైపు చూస్తున్నారని, కాంగ్రెస్ ఓడించేందుకు ప్రజలు ఎదురు చూ స్తున్నరని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనలో పంచాయతీలు ఎట్లా నిర్వీర్యమయ్యాయో, కేంద్ర నిధులు ఎట్లా డైవర్ట్ అ య్యాయో తాజామాజీ సర్పంచులను అడిగితే వాళ్లే చెబుతారన్నారు. చేసిన పనులకు బిల్లులివ్వక పోవడంతో సర్పంచులు తీవ్రం గా నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చే సుకున్నారని, చాలా మంది సర్పంచులు అ ప్పులు చెల్లించలేక ఊళ్లో ముఖం చూపలేక ఊరొదిలి హైదరాబాద్ పోయి కూలీ పను లు చేసుకుంటున్నారన్నారు.

తాజామాజీ స ర్పంచులు, రైతులు, మహిళలు, వ్రుద్దులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈ సారి కాంగ్రెస్ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతు న్నారని చెప్పారు. ఇగ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చి ఓట్లేసి బాధ్యత తీసుకోవాలని కోరారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజే పీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, అందుకోసం ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలు పే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేయాలి. టిక్కెట్ రాకపోయినా బాధపడొద్దని, వాళ్లకు పార్టీ పదవులుసహా ఇతరత్రా అన్ని రకాల సహాయం అందించేందుకు తా ను సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు.

ద యచేసి టిక్కెట్లు రాకపోయినా పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని, పొరపాటున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లేనని, వాళ్ల విషయంలో కఠినంగా వ్యవ హరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి సత్యనారాయణ, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, కోమాల అంజనేయులు, వాసాల రమేశ్, రామ్ గోపాల్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.