గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యం
12-06-2024 12:55 AM
పటాన్‌చెరు, జూన్ 11: పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామ శివారులోని ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు సమీపంలో ఉన్న చెట్లపొదల్లో మంగళవారం ఉదయం సుమారు 8 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పటాన్‌చెరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడు మెరున్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించాడని, ఎత్తు సుమారు 4 అడుగుల 4 అంగుళాలు ఉంటుందని తెలిపారు. బాలుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్‌లో సంప్ర దించాలని సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






