16 April, 2026 | 5:55 AM

108, 102 అంబులెన్సుల ఆకస్మిక తనిఖీ

04-11-2025 07:21 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ లో గల 108, 102 అంబులెన్సులను వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీముద్దీన్, భూపాలపల్లి జిల్లా మేనేజర్ రాజు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రోగ్రాం మేనేజర్ మాట్లాడుతూ కేసు వచ్చిన వెంటనే తొందరగా పెషంట్ దగ్గరికి వెళ్లి, వాళ్ళకి నాణ్యమైన చికిత్స అందిస్తూ, దగ్గరలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా వెహికల్ లో గల అత్యవసర పరికరాలను, మందులను, రికార్డ్ లను పరిశీలించారు. 108, 102 సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో 108, 102 సిబ్బంది ఈఎంటి మంచికట్ల సుధాకర్, పైలెట్ గోండా ప్రవీణ్ కుమార్, కెప్టెన్ బుర్రి రాజశేఖర్ పాల్గొన్నారు.