04-11-2025 07:18:06 PM
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ పరిశీలించి, పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేసి పోలీస్ స్టేషన్ ల పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకొని, ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... ప్రజా సమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించాలని అన్నారు.
విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో తరచు పర్యటిస్తు ప్రజలలో తస్సబంధాలు మెరుగు పర్చుకుంటు గ్రామస్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని ఆదేశించారు. పెట్రోలింగ్ సమయంలో రౌడి షీటర్స్ లని తనిఖీ చేయాలని, ప్రతి రోజు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని, సిబ్బంది కి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలి అని సూచించారు. ఎస్.ఐ రాహుల్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.