calender_icon.png 14 January, 2026 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళ మహారాణులకు ముగ్గుల పోటీలు

14-01-2026 08:55:59 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ 60వ డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీలో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెరుగు శివ, శ్రీ వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో మహిళ మహారాణులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథులుగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ యాదవ్, ముగ్గుల పోటీ జడ్జిగా రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ విజయ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే మహిళ మహారాణుల పండుగని,  న్యాయనిర్నేతల పర్యవేక్షణలో ముగ్గులు వేసి వాటిలో అత్యుత్తమైన ముగ్గులను ఎంపిక చేశారు.

తదనంతరం గెలుపొందిన వారికి ప్రధమ బహుమతి శారద, ద్వితీయ బహుమతి స్వర్ణలత, తృతీయ బహుమతి దాత్రి సరిత, అలాగే కన్సోలేషన్ బహుమతులు చిన్నారి ఆధ్యా, నల్లెల్ల స్వప్న లకు బహుమతులు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, ఫిషర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మండల సమ్మయ్య, 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎనుకుంటి పున్నంచందర్, కాంగ్రెస్ నాయకులు జనగాం శ్రీనివాస్, గణేష్, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు వేముల రవికుమార్, రవీందర్ రెడ్డి, గంభీర్ రెడ్డి, శ్రీకాంత్, శ్యామ్, కృష్ణ, కర్ణాకర్ రెడ్డి, రవీందర్, వెంకట్ రెడ్డి, ధర్మ నాయక్, ఆగారావు, భాస్కర్, మహిళలు స్వప్న, కవిత, సరిత, స్వాతి, సంధ్యారాణి, జయశ్రీ, హారిక, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.