calender_icon.png 14 January, 2026 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

14-01-2026 08:53:51 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తాండూర్ మండలం రేచినిరోడ్ రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు.  బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య  తెలిపిన వివరాల ప్రకారం.. 45 ఏళ్ల యువకుడు రైల్వేట్రాక్ పక్కన తీవ్రమైన గాయాలతో పడివున్నాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనంలో బెల్లంపల్లి  ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లభించలేదని, ఎరుపు రంగు బనియన్, ఆకుపచ్చ రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రి మార్చురిలో భద్రపర్చారు. సమాచారం తెలియన వారు ఈ సెల్ ఫోన్ నంబర్లను  (8712658601,9849198382 ) సంప్రదించాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య తెలిపారు.