calender_icon.png 12 July, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో ముమ్మరంగా ర్యాపిడ్ ఫీవర్ సర్వే

12-07-2025 12:00:00 AM

మణుగూరు,జులై 11 ( విజయ క్రాంతి ) :  సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో మండల వైద్యారోగ్య శాఖఅప్రమత్తమైంది. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కాలనీలు, గ్రామాలలో వైద్యులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు.

శుక్రవారం అన్ని గ్రామల్లో రాపిడ్ ఫీవర్ సర్వేను ముమ్మరం చేశారు. వైద్యాధికారి డాక్టర్. నిశాంత్ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ పరిసరాల శుభపరిశుభ్రతను బాధ్యతగా పాటించాలన్నారు. ఈ కార్య క్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.