11-07-2025 11:31:23 PM
మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కాలనీలతోపాటు, పంచాయతీలలోని గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలు మలేరియా, డెంగీ బారిన పడకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సిపిఐ మండల, పట్టణ కార్యదర్శులు జక్కుల రాజబాబు, దుర్గ్యాల సుధాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీతో పాటు పంచాయతీలలో చెత్తా చెదారం పెరిగిపోయి, దోమలు స్వైర విహారం చేయడంతో ప్రజలు జ్వరాలు బారిన పడి ఇబ్బంది పడుతున్నారని, ఈ జ్వరాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికా రులు గ్రామాలలో ప్రజా ఆరోగ్యా న్ని కాపాడాలన్నారు.