12-07-2025 12:00:00 AM
భద్రాచలం , జులై 11, (విజయ క్రాంతి):ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని మారుతి పారామెడికల్ కాలేజ్ నందు లయన్స్ క్లబ్ అఫ్ భద్రాచలం అధ్యక్షురాలు శ్రీమతి కమల రాజశేఖర్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ వి. జయభారతి పాల్గొని అధిక జనాభా వలన భూమి కి కలుగు భారం దాని వలన జరుగు నష్టాలు విద్యార్థులకి తెలియపరచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు జిఎస్ శంకర్రావు యోగి సూర్యనారాయణ గట్టు వెంకటాచారి సిహెచ్ రామలింగం, నరసింహ చారికళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు పాల్గొన్నారు ప్రోగ్రామ్ చైర్మన్ గా సోమశేఖర్ పరిమి వ్యవహరించారు.