13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రాజంపేటలో వేగంగా పారిశుద్ధ్య పనులు

23-03-2026 01:08 PM

పరిశీలించిన సర్పంచ్ బుర్స పోచయ్య, వార్డు సభ్యుడు గులాం జావిద్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీలో పరిశుభ్రత కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని నాలీలు (డ్రైనేజీలు) శుభ్రపరిచే పనులను సర్పంచ్ బుర్స పోచయ్య వార్డు సభ్యుడు గులాం జావిద్ తో కలిసి  పరిశీలించారు. గ్రామంలో ఎక్కడా మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నాలీలను పూర్తిగా శుభ్రం చేయాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు.

పనుల్లో అలసత్వం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ప్రతి వీధిలో పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామాన్ని శుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు  పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.