23 March, 2026 | 7:53 PM

రన్ ఫర్ జీసస్ పోస్టర్ ఆవిష్కరణ

23-03-2026 01:06 PM

ఏప్రిల్ 4న భారీ ర్యాలీ – విజయవంతం చేయాలని పిలుపు

రెవరెండ్ ఏనోష్ కుమార్ పిలుపు

కల్లూరు,(విజయక్రాంతి): మండల ఐక్య క్రైస్తవ సమైక్య,అసోసియేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ క్రిస్టియన్ కమిటీ ఆధ్వర్యంలో కల్లూరులో ఏప్రిల్ 4న నిర్వహించనున్న “రన్ ఫర్ జీసస్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ ఏనోష్ కుమార్ ఆవిష్కరించారు.సోమవారం టిజిఎం వర్షిప్ సెంటర్‌లో మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రెవరెండ్ ఏనోష్ కుమార్ మాట్లాడుతూ... యేసుక్రీస్తు సిలువ, మరణం,పునరుత్థాన సందేశాన్ని ప్రజల్లో విస్తరించడమే “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ఏప్రిల్ 4న కల్లూరు ఎన్ఎస్పి క్రాస్ రోడ్ నుంచి నూతన బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవులు,క్రైస్తవ నాయకులు మాత్రమే కాకుండా క్రైస్తవేతరులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు,నియోజకవర్గ అధ్యక్షులు పి.డి.దాసు,కన్వీనర్ కెనడి రాజు,గౌరవ సలహాదారు టి. సంజీవరావు,కల్లూరు మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్, పెనుబల్లి మండల అధ్యక్షులు కోట దేవదానం,వేంసూర్ మండల అధ్యక్షులు మోదుగు ఓనేసిమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దయాకర్,వైస్ ప్రెసిడెంట్ సుందర్ రాజు,జాన్ పరంజ్యోతి,ప్రధాన కార్యదర్శి రాయల తిమోతి,కోశాధికారి జీవన్ కుమార్,ఎగ్జిక్యూటివ్ సభ్యులు కట్టా మహేష్, యెహోషువతో పాటు పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు.