2 July, 2026 | 1:55 AM

బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

02-07-2026 12:56 AM

స్టార్ హాస్పిటల్స్‌లో విజయవంతంగా ఆపరేషన్

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్ ప్లాస్టి క్, రీకన్‌స్ట్రక్టివ్ అండ్ ఈస్తటిక్ సర్జరీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ బిఆర్‌ఎన్ పద్మి ని నేతృత్వంలో ’ఫేషియల్ ఇన్ఫిల్ట్రేటింగ్ లిపోమాటోసిస్’ అనే అత్యంత అరుదైన పు ట్టుకతో వచ్చే ముఖ వ్యాధితో బాధపడుతు న్న 10 ఏళ్ల బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స ని ర్వహించారు. ఈ వ్యాధి కారణంగా బాలుడి ముఖం ఒకవైపు అసాధారణంగా పెరిగి, మాట్లాడటం, నోరు మూయడం వం టి స మస్యలు తలెత్తాయి. డాక్టర్ పద్మిని మాట్లాడుతూ..

ఇది సాధారణ కొవ్వు గడ్డ కాదని, ముఖంలోని కణజాలాల్లోకి చొచ్చుకుపోయే అరుదైన వ్యాధి కావడంతో నరాలను రక్షి స్తూ ముఖ ఆకృతిని, నోటి పనితీరును పునరుద్ధరించేలా శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటూ, ముఖ రూపం, నోటి పనితీరు గణనీయంగా మెరుగుపడ్డాయని స్టార్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాధవి ఖురానా తెలిపారు.