16 April, 2026 | 12:42 PM

వన్ హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స

21-06-2025 01:58 AM

కరీంనగర్, జూన్ 20 (విజయ క్రాంతి): నగరంలోని వ న్ హాస్పిటల్లో వైద్యులు శుక్రవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట గ్రామానికి చెందిన గా జెంగి రాజశేఖర్ రెండు సంవత్సరాలుగా గుండెనొప్పితో బా ధపడుతూ అనేక ఆసుపత్రిలో చూపించుకున్నాడు.

ఎంతకు నయం కాకపోవడంతో వన్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ సదాశివ తమగొండను సంప్రదించగా, అవసరమైన అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి తీవ్రమైన అయోర్టిక్ రిగరిజటేషన్, కరోనరి ఆర్టరి వ్యాధి, డైరేటడ్ ఆరోహణ, ఎయిర్జా, తీవ్రమైన మిట్రల్ రిగర్జిటేషన్, తీవ్రమైన ఎల్పే డిస్ఫంక్షన్గా నిర్ధారించబడ్డాయి.

దాదాపు 12 నుంచి 14 గంటలు శ్రమించి రోగికి మెడిఫైడ్ బెంటాల్స్ విత్ అయోర్టిక్ వాల్వ్ గ్రాఫ్ట్, మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, సీఏబీజీ సర్జర్ ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేశారు. ఈ అరుదైన శస్త్ర చికిత్సను డాక్టర్ సదాశివ తమగొండ, డాక్టర్ గోవింద్ జాదవ్, డాక్టర్ ప్రత్యూష, వారి బృంద విజయవంతంపూర్తిచేశారు.