calender_icon.png 12 January, 2026 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేర్ హాస్పిటల్స్‌లో అరుదైన చికిత్స

11-01-2026 01:03:37 AM

అత్యాధునిక లింబ్ సాల్వేజ్ శస్త్రచికిత్సలతో నలుగురి కాలు తీసేయాల్సిన పరిస్థితి నుంచి మళ్లీ నడిచే స్థితికి..

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ వైద్యులు నలుగురు రోగులకు అరుదైన లిం బ్ సాల్వేజ్ చికిత్స చేసి చేతులు, కాళ్లను కాపాడారు. సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ వైద్యుడు డా అజయ్ కుమార్ పరుచూరి నాయకత్వంలో, అత్యంత క్లిష్టమైన పరిస్థితు ల్లో ఉన్న నలుగురి చేతులు, కాళ్లను ఇలిజారోవ్ లింబ్ రీకన్స్ట్రక్షన్ విధానంతో విజయవంతంగా కాపాడారు. హైదరాబాద్కు చెంది న 33 ఏళ్ల ఎన్ నీలిమా దేవి రోడ్డు ప్రమాదంలో తీవ్రమైన ఓపెన్ ఫ్రాక్చ ర్కు గురయ్యారు.

గత చికిత్సల తర్వాత ఎముకలో ఇన్ఫెక్షన్ రావడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. ఇన్ఫెక్షన్ ఉన్న ఇంప్లాంట్లను తొలగించి, ఇలిజారోవ్ ఫిక్సేటర్ అమర్చారు. దీర్ఘకాల చికిత్స, బోన్ గ్రాఫ్టింగ్తో ఎముక పూర్తిగా కలిసిపోయి నీలిమా మళ్లీ స్వయంగా నడవగలిగే స్థితికి చేరుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల డి వెంకటేశ్వరరెడ్డి కదులుతున్న రైలు నుంచి పడిపోవడంతో తీవ్రంగా మట్టి, మలినాలతో నిండి న ఓపెన్ ఫ్రాక్చర్ ఏర్పడింది. అత్యవసరం గా ఇలిజారోవ్ ఫిక్సేషన్ చేయడం ద్వారా క్రమంగా ఎముక మానిపించి శాశ్వత వికలాంగతను తప్పించారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు పరిశ్రమ ప్రమా దంలో కాలిన గాయా లు, అనేక ఎముకల విరుగుడులతో తీవ్రంగా గాయపడ్డాడు. కేర్ హాస్పిటల్స్‌లో దశలవారీగా ఇలిజారోవ్ విధానంతో చికిత్స చేసి, ఇన్ఫెక్షన్‌ను నియంత్రించి, ఎముకలు కలిపి, 6 సెంటీమీటర్ల లింబ్ లెంగ్త్ పెంపు కూడా విజయవంతంగా చేశారు. ఫలితంగా అతడు మళ్లీ సరిగా నడవగలిగే స్థితికి చేరుకున్నా డు. ఖమ్మం జిల్లా చెందిన 51 ఏళ్ల సిహెచ్ లక్ష్మణ్ బైక్ ప్రమాదంలో తీవ్రమైన ఓపెన్ ఫ్రాక్చర్‌తో పాటు రక్తనాళాలకు గాయాలపా లయ్యాడు. ఇలిజారోవ్ ఫిక్సేషన్, బోన్ గ్రాఫ్టిం గ్, క్రమబ ద్ధమైన రిహాబిలిటేషన్తో చికిత్స చేసి మళ్లీ స్వతంత్రంగా నడిచేలా చేశారు. ఈ విజయాలను డా. అజయ్ కుమార్ పరుచూరి, కేర్ హాస్పిటల్స్ బాధ్యతపై బిజూ నాయర్ , జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వివరించారు.