11-01-2026 01:01:56 AM
రూ.లక్ష విరాళం అందించిన డాక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): అంతర్జాతీయ చాంబర్స్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షుడు, లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రదానం చేసిన భారత్ గౌరవ్ అవార్డు గ్రహీత డా అజయ్ కుమార్ అగర్వాల్.. హైదరాబాద్లో జనవరి 10, 11 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఏషియన్ థలసేమియా కాన్‌క్లేవ్ హాజరయ్యారు. థలసేమియా, ఇతర రక్త సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగుల సహాయార్థం రూ.లక్ష విలువైన చెక్కును తెలంగాణ థలసేమియా, సికిల్ సొసైటీ అధ్యక్షుడు డా. చంద్రకాంత్ అగర్వాల్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డా. అజయ్ కుమార్ అగర్వాల్, డా. చంద్రకాంత్ అగర్వాల్ నాయకత్వంలో థలసేమియా, సికిల్ సొసైటీ, తెలంగాణ నిర్వహిస్తున్న సేవలను ప్రశంసించారు. ఇలాంటి మాన వతా కార్యక్రమాలకు చేయూతనివ్వడం సామాజిక బాధ్యతతో పాటు మానవీయ విలువలకు నిదర్శనమని డా. అజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. డా. చంద్రకాంత్ అగర్వాల్ మాట్లాడుతూ.. డా. అజయ్ కుమార్ అగర్వాల్ అందించిన సహాయం థలసీమియా రోగులకు వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలను కొనసాగించడంలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు.