రేషన్ డీలర్ డబ్బులు వసూలు
సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు, బీజేపీ నాయకులు
బాన్సువాడ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలోని రేషన్ డీలర్ రేషన్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజల నుండి ఒక్కొక్కరి వద్ద 5 వేల రూపాయల వరకు వసూలు చేశారని మంగళవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి గ్రామస్తులతో పాటు బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని రేషన్ షాప్ నంబర్ 2901006 డీలర్ రేషన్ కార్డుల కొరకు ఐదువేల రూపాయలు వసూలు చేశారని సంబంధిత రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే తాము నిజాలు బయటపెడతామన్నారు.
ఆ రేషన్ డీలర్ పై కఠిన చర్యలు తీసుకొని ఆ డీలర్ షిప్ ను రద్దు చేయాలని డబ్బులు ఇచ్చిన వారి డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి స్పందిస్తూ వెంటనే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, నాగరాజు రాజారెడ్డి, సంతోష్ తుకారాం సరిత దత్తు లక్ష్మణ్ రాజాసింగ్, బాధితులు తదితరులు పాల్గొన్నారు.




