16 March, 2026 | 5:38 PM

హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా

18-07-2024 07:43 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తెలంగాణ డీజీపీగా పని చేసిన  రవి గుప్తా ప్రస్తుతం తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్‌ను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ప్రభుత్వం నియమించింది.