హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్‌తో సంక్రాంతికి వస్తున్న రవితేజ
‘ఇరుముడి’ సంచలన విజయానందంలో ఉన్నారు మాస్ మహారాజా రవితేజ. అదే జోష్‌లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం ‘దాగుడు మూతలు దండాకోర్’ అన్న క్యాప్షన్‌తో తాజాగా పంచుకున్న రిలీజ్ డేట్ అప్‌డేట్ సినీప్రియుల్లో ఒక్కసారిగా పెంచేసింది.
సంక్రాంతి కానుకగా 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందీ చిత్రం. హసిత్ గోలి కామెడీ డ్రివెన్ కాన్సెప్ట్‌తో రూపొందించనున్న ఈ సినిమాలో రవితేజ సరికొత్తగా కనిపించబోతున్నారు. హ్యూమర్, ఎనర్జీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పుల్ లెంత్ ఎంటర్‌టైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందీ సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సినిమా టైటిల్‌ను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.






