26 August, 2026 | 3:14 AM

‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపు

26-08-2026 01:08 AM

మలయాళ స్టార్ యశ్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ రూపొందిస్తున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనుమతి లభించింది.

ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి. సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్సుల్లో రూ.100 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అవకాశమిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 26న ఉదయం 6 గంటల స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా (జీఎస్టీతో కలిపి) నిర్ణయించారు. పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయని, రోజుకు ఐదు షోలను ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించాయి. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి రూ.కోటి డిపాజిట్ చేయాల్సిందిగా చిత్ర నిర్మాణ సంస్థకు సూచించారు.