2 July, 2026 | 2:35 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

మిస్టర్ బచ్చన్ టైటిల్ రవితేజ సూచించిందే!

29-07-2024 12:05 AM

ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా టీజర్ ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయ సమావేశంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్, దర్శకుడు హరీశ్ శంకర్, కెమెరా మెన్ అయనంక బోస్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె ఇతర చిత్ర బృందం పాల్గొన్నా రు. టీజర్ విడుదల అనంతరం దర్శకుడు హరీశ్ పాత్రికేయులతో సంభాషిస్తూ “ఆడియో క్యాసెట్ల రికార్డింగ్ సెంటర్స్, ల్యాండ్ లైన్ ఫోన్లు, చేతక్ స్కూటర్లు వినియోగంలో ఉన్న 1985-95 మధ్య నడిచే కథ ఇది.

ప్రథమార్థంలో ఆ నేప థ్యంలో వచ్చే సన్నివేశాలకు చాలామంది కనెక్ట్ అవుతారన్న ఆయన, టైటిల్‌ను ఉద్దేశిస్తూ మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ రవితేజ సూచించినదే” అని తెలిపారు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదల రోజునే ‘మిస్టర్ బచ్చన్’ రావడంపై స్పందిస్తూ “పంపిణీదారులు, ఇతర వ్యాపార కారణాలతో ఈ తేదీకి వస్తు న్నాం.. తప్పితే ఉద్దేశపూర్వకంగా చేస్తుంది కాదు” అని చెప్పిన హరీశ్, ఈ సందర్భంగా రామ్ కథానాయకుడిగా తాను ఓ సినిమా చేయనున్నట్టు వెల్లడించారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.