ఆర్‌సీబీ ధనాధన్
ఐపీఎల్ 2026 సీజన్‌కు అదిరే ఆరంభం... హోంగ్రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే ఆడిన ఆర్సీబీ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. భారీస్కోరు చేసినా బౌలింగ్ బలహీనంగా ఉండడంతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూసింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో పడిక్కల్, కోహ్లీ విధ్వంసం హైలెట్‌గా నిలిచింది.
బెంగళూ రు, మార్చి 28 : ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయ ల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుం ది. గత ఏడాది చిన్నస్వామి స్టేడి యం దగ్గర జరిగిన తొక్కిసలాట మృతులకు ఇరు జట్లు నివాళులర్పించగా.. ఆర్సీబీ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. హ్యాజిల్ వుడ్‌కు బ్యాకప్ బౌలర్‌గా వచ్చిన జాకబ్ డఫీ సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. వరుసగా ఓవర్లు వేసి తన స్పెల్ పూ ర్తి చేసుకున్న డఫీ హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీశ్ కుమా ర్ రెడ్డి(1) లను పెవిలియన్ కు పంపా డు. దీంతో సన్‌రైజర్స్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది.
ఈ దశలో ఇషాన్ కిషన్ కెప్టె న్ ఇన్నింగ్స్ ఆడాడు. క్లాసె న్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. అయితే క్లాసెన్ (31) వివాదాస్పద క్యాచ్‌కు ఔటయ్యా డు. ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి ఔటవగా.. ఇక్కడ నుంచి సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా అనికేత్ వర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లో 43 ( 3ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు.
దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్ల లో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. 2 ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన ఫిల్ సాల్ట్ (8) ఔటయ్యాడు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ సన్ రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పడిక్కల్, కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్ తో సన్‌రైజర్స్ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు.
వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 45 బంతుల్లోనే 101 పరుగులు జో డించారు. పడిక్కల్ 61( 27 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రన్స్ కు ఔటైనా... కోహ్లీ, పటిదార్ దూకుడు కొనసాగించారు. కెప్టెన్ పటిదార్ కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసా డు.
చివర్లో పటిదార్, జితేశ్ శర్మ ఓకే ఓవర్లో ఔటైనా.. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్ ఆర్సీబీ విజయాన్ని పూర్తి చేశారు. ఫలితంగా ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో డేవిడ్ పైన్ 2, హర్ష్ దూబే, ఉనాద్కట్ ఒక్కో వికెట్ తీశారు.
స్కోరు బోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 201/9 (ఇషాన్ కిషన్ 80, అనికేత్ వర్మ 43, క్లాసెన్ 31; డఫీ 3/22, షెఫర్డ్ 3/54 )
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 203/4 (15.4 ఓవర్లు)( కోహ్లీ 69 నాటౌట్, పడిక్కల్ 61, పటిదార్ 31; పైన్ 2/35, ఉనాద్కట్ 1/29)
తొక్కిసలాట మృతులకు నివాళి
గత ఏడాది ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాటలో చనిపోయిన మృతులకు నివాళిగా ఒక గ్యాల రీలో 11 సీట్లు ఖాళీగా ఉంచారు.




