30 March, 2026 | 2:54 AM

ధోనీ 6 మ్యాచ్‌లకు ఔట్

30-03-2026 01:25 AM

4 వారాలు దూరం

చెన్నై, మార్చి 29 : చెన్నై సూప ర్ కింగ్స్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. స్టార్ ప్లేయర్ మ హేంద్రసింగ్ ధోనీ కండరాల నొ ప్పితో ఇప్పటికే 2 వారాలు దూరమైనట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. అయితే ధోనీ నాలుగు వారాల వరకూ అందుబాటు లో ఉండడని సమాచారం. గాయం నుంచి కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది.

దీని ప్రకారం చూస్తే ధోనీ చెన్నై ఆడే 6 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. రాజస్థాన్, పంజాబ్, ఆర్‌సీబీ, ఢిల్లీ, కేకేఆర్, సన్‌రైజర్స్ మ్యాచ్‌లకు ధోనీ దూరమవడం ఖాయమైంది.  ఏప్రిల్ చివరి వారంలో మళ్లీ జట్టుతో కలుస్తాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.   ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో మిస్టర్ కూల్‌ను చూడొచ్చు. ధోనీ దూరమవడంతో చెన్నై కీపింగ్ బాధ్యతలు సంజూ శాంసన్ కు అప్పగించారు. 

బ్రెవిస్ మూడు మ్యాచ్‌లకు దూరం

సౌతాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్‌కు గాయమైంది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. బ్రెవిస్ పక్కటెముకల నొప్పితో బాధపడుతున్నాడు. అతను కోలుకునేందు కు కనీసం రెండు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ధోనీ ఆరు మ్యాచ్‌లకు దూరమైన వేళ బ్రెవిస్ కూడా అందుబాటులో లేకపోవడం చెన్నైకి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.