15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో

17-04-2025 01:20 AM

- రికార్డుల పరిశీలన 

- ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు

పటాన్ చెరు, ఏప్రిల్ 16 : అమీన్ పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. వివిధ అవసరాల కోసం కార్యాలయానికి  వచ్చిన దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులను వెంటవెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అమీన్ పూర్ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవకుండా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలపై  డీఎస్పీతో చర్చించామన్నారు. అలాంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, ఉప తహసీల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఆర్‌ఐ లు రఘునాథరెడ్డి, శ్రీమాన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.