28 June, 2026 | 2:05 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

చేవెళ్లకు బదిలీ అయిన ఆర్డీఓకు ఘన సత్కారం

28-02-2026 02:36 AM

విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేసిన అధికారిగా ప్రశంసలు

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఆర్డీఓగా పనిచేస్తున్న పార్టసింహారెడ్డి చేవెళ్లకు బదిలీపై వెళ్తుండగా శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాతో ఆర్డీఓను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టసింహారెడ్డి విధి నిర్వహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిం చారని తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా సేవలు అందించారని కొనియాడారు.ఇక్కడి నుండి బదిలీపై వెళ్లడం స్థానిక ప్రజలకు బాధకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని, అయినప్పటికీ ఆయన చేసిన సేవలు ప్రజల మదిలో నిలిచిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆర్డీఓకు శుభాకాంక్షలు తెలియజేశారు.