10-11-2025 10:45:00 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రజా నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు, తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ కాకతీయ కాల్వకు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును పెట్టాలని కోరగానే సంతాప సభలో, కాకతీయ కాలువకు, రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరును పెడతానని ప్రజలకు హామీ ఇస్తూ, గెజిటెడ్ జీవోను విడుదల చేయడం హర్షించదగ్గ విషయం. 284 కి.మీ నుండి 346 కి.మీ వరకు ఉన్న SRSP స్టేజ్-II కాకతీయ ప్రధాన కాలువకు "RDR SRSP స్టేజ్-II కాలువ"గా చేస్తూ జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. దీనితో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.