calender_icon.png 9 September, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైంగిక వేధింపుల నిందితుడికి మళ్లీ పోస్టింగ్?

08-09-2025 12:00:00 AM

  1. చేతులు మారిన లక్షలు? 

కేసు పూర్తికాకముందే సేమ్ పోస్టింగ్ 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి) లైంగిక వేధింపుల ఆరోపణపై స స్పెండ్ కు గురైన కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ రత్నరాజును కేసు విచారణ పూర్తికాక ముందే అదే కార్యాలయంలో నియామకం చేయడం పై అనేక ఆరోపణలు వెలబడుతున్నాయి. వివరాల్లోకెళ్తే ఈ ఏడాది మార్చి లో రత్నరాజ్ లైంగిక వేధింపుల కేసులో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ వైద్య ఆరోగ్యశాఖకు సరెండర్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాలను సైతం భే ఖాతరు చేస్తూ సదరు ఆ సీనియర్ అసిస్టెంట్ ను సరెండర్ చేయకుండా సస్పెండ్ ఆర్డర్ జారీ చేశారు. తిరిగి పోస్టింగ్ ఇప్పించడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కీల క పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ డీఎంహెచ్‌ఓ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వాసనీయ స మాచారం.వాస్తవంగా ఓ ఉద్యోగిపై ఆరోపణలు వెలబడితే శాఖ పరమైన చర్య ద్వారా సస్పెండ్ చేసి, కొంతకాలం అనంతరం వేరే ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చి, కేసును కొనసాగించడం సర్వసాధారణం.

అందుకు భిన్నం గా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ లైన్ గా వేధింపులు సస్పెండ్ గురై, హెల్త్ డైరెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా పాల్వంచ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ వో కార్యాలయాల్లో పోస్టింగ్ పొందారు. పో స్టింగ్ నిబంధనలకు విరుద్ధం కాగా, జిల్లా వై ద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విధుల్లో చే రడం మరీ వెడ్డూరంగా ఉంది.

రత్నరాజ్ ని యామకంపై అనేక ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపా యలు చేతులు మారినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.ఈ విషయమై జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారి జయలక్ష్మిని వివరణ కో రగా రత్నరాజ్ పాల్వంచ డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయానికి పోస్టింగ్ ఇ చ్చారని, ఆ కార్యాలయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే కలిసి ఉండటం తో,

జాయిన్ అవ్వడానికి కార్యాలయానికి వ చ్చారని తెలిపారు. అతనీ సస్పెన్షన్ వ్యవహా రం తనకేమీ తెలియదని, అప్పటి డిఎం అం డ్ హెచ్ ఓ హయాంలో జరిగిన అంశం కారణంగా వివరాలు తెలియదన్నారు. అతని పో స్టింగ్ లో తన ప్రమేయం లేదన్నారు.