09-09-2024 12:00:00 AM
ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ టాలీవుడ్‌ను ఊపేస్తోంది. స్టార్ హీరోల సినిమాలన్నీ వరుస పెట్టి రీ రిలీజ్ అవుతుండ టంతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. అయితే రీరిలీజ్ జోరులో చిన్న సినిమాలు చితికిపోతున్నాయి. మంచి సినిమాలు సైతం తెరమరగువుతూ నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఈ నేప థ్యంలో రీరిలీజ్ ట్రెండ్ కొంచెం ఇష్టం.. కొంచె కష్టంగా మారింది.
తెలుగు సినిమాల్లో రీరిలీజ్ ట్రెండ్ కామన్ అయిపోయింది. స్టార్ హీరోల బర్త్ డే సందర్భంగా వారి అభిమానులు తమ సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. బిజినెస్ మేన్, వెంకీ, మురారి, సింహాద్రి, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఇటీవల విడుదలై రికార్డు కలెక్షన్లు సాధించాయి. అయితే ఈ ట్రెండ్ కొత్త, చిన్న సినిమాలపై ప్రభావం చూపుతోంది. నటి నిహారిక కొణిదెల నిర్మించిన ’కమిటీ కుర్రోళ్లు’ సినిమా ఘనవిజయం సాధించింది. కానీ అదే రోజు రీ రిలీజ్ అయిన మురారి సినిమా ఈ మూవీపై తీవ్ర ప్రభావం చూపింది.
కమిటీ కుర్రోళ్లు తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినప్పటికీ.. మౌత్ టాక్ తో మరిన్ని థియేటర్లు పెరిగాయి. దాంతో మంచి కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఆగస్టు 9న మురారి విడుదల కాకపోతే కమిటీ కుర్రోళ్లు మరిన్ని కలెక్షన్లు రాబట్టేది. ఇక నాని రీసెంట్ గా నటించిన ’సరిపోదా శనివారం’ చిత్రం ఫస్ట్ వీకెండ్లో మంచి ఓపెనింగ్స్ సాధించి డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని గబ్బర్ సింగ్ రికార్డు స్థాయిలో రీరిలీజ్ అయింది. ప్యాక్ హౌస్ లతో మొదలైన ఈ చిత్రం సరిపోదా శనివారం సినిమాపై కలెక్షన్లపై ప్రభావం చూపింది. అయితే సరిపోదా శనివారం గ్రాస్ కంటే గబ్బర్ సింగ్ 5 రెట్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. రీరిలీజ్ కల్చర్ మంచిదే. అయినప్పటికీ ఈ ట్రెండ్ ప్రస్తుతం విడుదలవుతున్న చిన్న సినిమాలపై ప్రభావం చూపుతూ నిర్మాలను కోలుకొని దెబ్బతీస్తున్నాయి.
ఇక గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ నెల 2వ తేదీన ఖడ్గం మూవీ రీ రిలీజ్ కానున్నట్టు టాక్. ఖడ్గం సినిమాకు రీ రిలీజ్లో సైతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఇక ధనుష్ ‘కొలవెరి3’, మహేష్‌బాబు ‘అతడు’ లాంటి సినిమాలు రీరిలీజ్ లో భాగంగా రానున్నాయి. అయితే ఆ సమయంలో రిలీజ్ కాబోయే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోనుండటం ఖాయంగా తెలుస్తోంది.
కలెక్షన్లు ఓకే కానీ..
ఇటీవల రీరిలీజ్ అయిన మురారి, గబ్బర్ సింగ్ మంచి కలెక్షన్లు సాధించాయి. కేవలం మురారి అడ్వాన్సు సేల్స్ రూ. 3.46 కోట్లు రాబట్టగా, గబ్బర్ సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టి 4 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఒక్క కర్ణాటకలోనే గబ్బర్ సింగ్ 29.6 లక్షల అడ్వాన్స్ సేల్స్ చేసింది. ఈ క్రమంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ రేసులో గల్లంతవుతాయి. మోస్తారు నిర్మాతలను దెబ్బతీస్తూ టాలీవుడ్ నుంచి దూరం చేసేలా చేస్తున్నాయి రీరిలీజులు.