15 July, 2026 | 3:07 PM

Breaking News

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం

15-07-2026 03:07 PM

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం బుధవారం పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోట అనిల్, బంగ్లా అన్వేష్ కుటుంబాలను సందర్శించి వారికి సానుభూతి తెలిపారు. అలాగే విద్యుత్ ప్రమాదానికి గురైన జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్యాల రాజవీర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కటకం మృత్యుంజయం మాట్లాడుతూ బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రతి విషయంలో పార్టీ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్, నాయకులు శంకర్, రాజుగౌడ్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, దోసల చంద్రం, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.